‘విక్ర‌మ్’ గింప్ల్స్.. యాక్షన్‌ సీక్వెన్స్‌తో అదరగొట్టిన కమల్‌..!

Published on Nov 6, 2021 9:12 pm IST


విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

నవంబర్‌ 7న కమల్‌ హాసన్‌ పుట్టినరోజు కావడంతో ది ఫస్ట్ గ్లాన్స్ పేరిట చిత్ర బృందం ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. 48 సెకన్ల నిడివి గల వీడియో కమల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ జైల్లో నుంచి తప్పించుకుంటున్న సమయంలో పోలీసులు వెంటపడి కాల్పులు జరుపుతుంటారు. పోలీస్‌ రక్షణ కవచాలను అడ్డుపెట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా ఆ రక్షణ కవచాలను ఓపెన్‌ చేసి తనదైన యాక్షన్‌ లుక్‌లో కనిపించిన విక్రమ్ లుక్ అదరగొట్టేలా ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More