విక్రమ్ ను ఒప్పించాలని ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ?

విక్రమ్ ను ఒప్పించాలని ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ?

Published on Oct 3, 2022 6:55 AM IST

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. అందుకే, ఈ పాత్ర కోసం తమిళ హీరో విక్రమ్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో చూడాలి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ప్లాన్ అవుతుందని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు