“విక్రమ్ వేద” ట్రైలర్ కి ఇండియాలో ఫస్ట్ ఎవర్ రిలీజ్ ప్లాన్.!

Published on Sep 7, 2022 11:00 am IST

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్ వేద” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సినిమా నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి గట్టి ప్రమోషన్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు.

అయితే రీసెంట్ గానే సినిమా ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి కూడా డేట్ ని ఈ సెప్టెంబర్ 8గా అనౌన్స్ చెయ్యగా ఇప్పుడు మరో క్రేజీ అనౌన్సమెంట్ అయితే అందించారు. ఈ రిలీజ్ డేట్ కన్నా ముందే ఇండియన్ సినిమాలో మొట్ట మొదటి సారిగా ఒకరోజు ముందే థియేటర్స్ లో ట్రైలర్ ని వేస్తున్నట్టుగా తెలియజేసారు. మరి ఇందుకు గనుఁ దేశంలో మొత్తం 10 సిటీలను ఎంపిక చేసి వాటి లిస్ట్ కూడా రిలీజ్ చేసారు.

మరి వాటిని చూసినట్టు అయితే ముంబై, హైదరాబాద్, పూణే, జైపూర్, బెంగళూరు అలాగే, న్యూ ఢిల్లీ, కలకత్తా, అహ్మదాబాద్ ఇంకా భువనేశ్వర్ మతియు దుబాయ్ లలో ఈ క్రేజీ ట్రైలర్ ని ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేస్తున్నారట. మరి ఇది సాలిడ్ ప్లానింగ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే పుష్కర్ గాయత్రీ లు దర్శకత్వం వహించగా ఈ సెప్టెంబర్ 30న సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :