తన గెటప్స్‌తో మరోసారి ఆశ్చర్యపరిచిన విక్రమ్!

2nd, August 2016 - 05:41:45 PM

iru-murugan
హీరో విక్రమ్ గురించి తెలుగు, తమిళ సినీ అభిమానులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌతిండియన్ సినిమాలో పలు అద్భుతమైన ప్రయోగాలు చేసి, నటనపై తనకున్న మక్కువ చూపి అందరి మన్ననలూ పొందిన ఈ హీరో తాజాగా ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియోలను నేడు చెన్నైలో విడుదల చేశారు.

ఇక ఈ ట్రైలర్ చూసిన వారంతా విక్రమ్ గెటప్స్‌లో చూపిన ప్రయోగానికి ఫిదా అయిపోయారు. ఓ హిజ్డా తరహా పాత్రలో నాలుగైదు గెటప్స్‌లో కనిపించి విక్రమ్ సూపర్ అనిపించుకున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, నయనతార, నిత్యా మీనన్ విక్రమ్ సరసన హీరోయిన్లుగా నటించారు. తన గత రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో విక్రమ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఇక తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో, ట్రైలర్ త్వరలోనే విడుదల కానున్నాయని టీమ్ తెలిపింది.

ఇరుముగన్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి