శివ కార్తికేయన్‌ మావీరన్‌తో క్లాష్ కానున్న విక్రమ్‌ “ధృవ నట్చరితం”?

Published on May 25, 2023 8:05 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ చాలా కాలంగా వాయిదా పడిన చిత్రం ధృవ నట్చరితం ఈ ఏడాది గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. వివిధ కారణాల వల్ల షూటింగ్ చాలా సంవత్సరాలు ఆగిపోయింది, ఇటీవలే ప్రొడక్షన్ పార్ట్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పై థ్రిల్లర్. తమిళ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ చిత్రం జూలై 14న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇదే జరిగితే, శివ కార్తికేయన్ మావీరన్‌తో బాక్సాఫీస్ క్లాష్ ఉంటుంది. ఈ చిత్రం కూడా అదే తేదీన విడుదల అవుతుంది.

మావీరన్‌ను మొదట ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు మేకర్స్. అయితే రజనీ యొక్క జైలర్ ఉండటం తో మావీరన్ టీమ్‌ను డేట్ లో మార్పు వచ్చింది. మరి ఈ క్లాష్ జరుగుతుందో లేదో చూడాలి. ఈ ధృవ నట్చరితం లో రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, హారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :