ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం, మహాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అనేక ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, OTT ప్లాట్‌ఫాం లో ఫిబ్రవరి 10న తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం డిజిటల్‌గా రానున్నట్లు ప్రకటించింది.
విక్రమ్ కుమారుడు, నటుడు ధృవ్ విక్రమ్ కూడా మొదటిసారిగా స్టార్ పెర్ఫార్మర్తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ 60వ చిత్రం రూపొందుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వాణి భోజన్, సిమ్రాన్ బగ్గా, బాబీ సింహా, సనత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.