విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ సెన్సార్ పూర్తి…త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ!

విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ సెన్సార్ పూర్తి…త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ!

Published on Jul 4, 2024 11:00 PM IST

సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ పా. రంజిత్‌తో కలసి తంగలాన్ సినిమా కోసం స్టార్ హీరో విక్రమ్ చేతులు కలిపాడు. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే 2 నిమిషాల 12 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే సెన్సార్ చేయబడింది.

ట్రైలర్‌లో రిలీజ్ డేట్ కూడా ఉంటుందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మేకర్స్ పవర్ ఫుల్ మూమెంట్స్‌తో ట్రైలర్‌ను ప్రిపేర్ చేసినట్లు చెబుతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు