పవర్ ఫుల్ గా విక్రమ్ “తంగలాన్” ట్రైలర్!

పవర్ ఫుల్ గా విక్రమ్ “తంగలాన్” ట్రైలర్!

Published on Jul 10, 2024 5:36 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చెప్పిన టైమ్ కే ట్రైలర్ ను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసారు మేకర్స్.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. విక్రమ్ యాక్టింగ్ తో పాటుగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో ఉన్న ఈ థియేట్రికల్ ట్రైలర్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్ లా ఉంది. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు