విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్!

విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్!

Published on Jul 9, 2024 8:00 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 5:00 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ ట్రైలర్ లో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 2 నిమిషాల 12 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియెన్స్ ను అలరించనుంది. ట్రైలర్‌ ను చాలా పవర్ ఫుల్ గా కట్ చేసినట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు