“విక్రాంత్ రోణ” తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న కార్తికేయ గ్రూప్!

“విక్రాంత్ రోణ” తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న కార్తికేయ గ్రూప్!

Published on Jun 28, 2022 7:02 AM IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీ విక్రాంత్ రోణ జూలై 28, 2022 న థియేటర్ల లో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ని వరంగల్ శ్రీను కైవసం చేసుకున్నాడు. తన కార్తికేయ గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని వరంగల్ శ్రీను విడుదల చేయనున్నారు. నైజాం ప్రాంతంలో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్, సుల్తాన్, క్రాక్, సీటీమార్, ఆచార్య వంటి చిత్రాలను వరంగల్ శ్రీను పంపిణీ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, అభినయ్ రాజ్ సింగ్, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనుప్ భండారి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు