వావ్ : సుదీప్ ‘విక్రాంత్ రోనా’ 3డి ట్రైలర్ ప్రీమియర్ కి గెస్టులుగా రానున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే….??

Published on Jun 24, 2022 10:00 pm IST

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ కలిగి ఉన్నారు. ఆయన చేసిన పలు కన్నడ సినిమాలు ఇక్కడ డబ్ అయి సక్సెస్ సాధించడంతో పాటు నాని, సమంత ల కలయికలో తెరకెక్కిన ఈగ మూవీలో విలన్ గా చేసి తన నటనతో అందరికీ ఆకట్టుకున్న సుదీప్, అనంతరం సైరా, బాహుబలి మూవీస్ లో కూడా నటించారు. అయితే లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ విజువల్ వండర్ మూవీ విక్రాంత్ రోనా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో పాటు అవి మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచింది. అయితే ఈ మూవీ ట్రైలర్ ని 3డి వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్ ప్రీమియర్ ఈవెంట్ ని రేపు ఉదయం 11 గం. లకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పివిఆర్ ఆర్కె సినీ మల్టిప్లెక్స్ స్క్రీన్ 2 లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ ఈవెంట్ కి మన టాలీవుడ్ నుండి సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ, యంగ్ హీరో అక్కినేని అఖిల్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తదితర స్టార్స్ ప్రత్యేక అతిథులుగా రానున్నారు. ఈ విధంగా విక్రాంత్ రోనా మూవీకి ఇటు తెలుగులో కూడా మంచి ప్రమోషన్ చేస్తూ సినిమాకి బాగా హైప్ క్రియేట్ చేస్తోంది యూనిట్. ఇక ఈ మూవీ జులై 28న వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :