విక్రాంత్ రోణ టీజర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Mar 29, 2022 1:31 pm IST


శాండల్‌ వుడ్‌ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అనుప్ భండారి రచన మరియు దర్శకత్వం వహించిన, ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి మరియు నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల తేదీని ప్రకటించారు.

విక్రాంత్ రొణ యొక్క టీజర్ ఏప్రిల్ 2, 2022న ఉదయం 09.55 గంటలకు అన్ని ప్రధాన దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లీష్‌లో కూడా విడుదల కానుంది. షాలిని ఆర్ట్స్ బ్యానర్‌ పై జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాత్ సంగీతం అందించారు. టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :