బాలయ్య మాస్ ప్రాజెక్ట్ లో పవర్ ఫుల్ గా దునియా విజయ్ పాత్ర.!

Published on Mar 16, 2022 10:48 am IST

నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “అఖండ” తన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక దీన్ని తర్వాత బాలయ్య ఎలాంటి సినిమాలు టేకప్ చేస్తారు అనే టైం లో మరో బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ గా దర్శకుడు గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేశారు.

దీనిని కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలియజేసారు. మరి ఈ సినిమాలో బాలయ్య తో మరింత మంది స్టార్ కాస్ట్ ఉన్నట్టుగా ఒక్కో అప్డేట్ ని ఇచ్చారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నటువంటి కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ పాత్రను రివీల్ చేశారు.

ఈ సినిమాలో తాను ముసలి మడుగు ప్రతాప రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడని ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనితో బాలయ్యకి గట్టి పోటీ ఇచ్చే విలన్ గా తాను కనిపిస్తున్నాడు. దీనితో క్రేజీ అప్డేట్ బాలయ్య ఫ్యాన్స్ లో సరికొత్త ఊపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :