ఎన్టీఆర్ కి విలన్ ఎవరు ?

ఎన్టీఆర్ కి విలన్ ఎవరు ?

Published on Mar 26, 2023 2:40 AM IST

ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారని మొదట రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కి విలన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ టాక్ నడిచింది. పైగా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా అసలు ఎన్టీఆర్ సినిమాకి విలన్ ఇంకా ఫిక్స్ కాలేదు అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. మరి, ఇంతకీ ఎన్టీఆర్ సినిమాకి విలన్ ఎవరు ? అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మొత్తానికి కొరటాల శివ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు