ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ హీరో ?

ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ హీరో ?

Published on Dec 26, 2022 9:00 AM IST

ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మరో హిందీ హీరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కి విలన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సైఫ్ అలీ ఖాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

మరి ఎన్టీఆర్ సినిమాకి సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకుంటే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. మొత్తానికి కొరటాల శివ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు