కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” వరుస ప్రమోషన్స్

Published on Jan 26, 2023 8:26 pm IST


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.

ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన వాసవసుహాస పాటకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్స్ ను ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. గతంలో ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోందుకున్న ప్లేయర్ తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్ ను లాంచ్ చేయించింది చిత్రబృందం.

ఇప్పుడు మరో క్రేజి ఈవెంట్ ను ప్లాన్ చేసింది చిత్ర బృందం. వరంగల్ లోని కే స్ట్రీట్ లో ఈ మూవీ టీం ఒక బ్రేకప్ పార్టీ ను సెలెబ్రేట్ చేయనుంది. ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు. ఏదేమైనా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి ఈ చిత్రబృందము విభిన్న తరహాలో ప్రొమోషన్స్ నిర్వహిస్తుంది.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, సంగీతం చైతన్ భరద్వాజ్, DOP డేనియల్ విశ్వాస్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, పి.ఆర్.ఓ ఏలూరు శీను, మేఘశ్యామ్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :