ఈ విషయంలో “వినరో భాగ్యము” కూడా సూపర్ సక్సెస్.!

Published on Feb 17, 2023 3:59 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ హీరోయిన్ గా కాశ్మీరా నటించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా మంచి బజ్ ని ఆల్రెడీ సంతరించుకుంది. అయితే ఈ చిత్రం కూడా లేటెస్ట్ రిలీజ్ “సార్” లానే స్పెషల్ ప్రీమియర్స్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసుకోగా ఆ ఫార్ములా ఇప్పుడు ఈ సినిమాకి కూడా సూపర్ సక్సెస్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఈ స్పెషల్ షో కి బుకింగ్స్ ఓపెన్ చేయగా వినరో భాగ్యము కి కూడా సాలిడ్ రెస్పాన్స్ తో ఆడియెన్స్ హౌస్ ఫుల్స్ అందించారు. అంతే కాకుండా మరిన్ని షో లు ఈ సినిమాకి ఇప్పుడు అదనంగా పడుతుండడం విశేషం. దీనితో ఈ విషయంలో మాత్రం ఈ చిత్రం కూడా సూపర్ సక్సెస్ సాధించింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించారు. ఆలాగే గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రం శివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :