డీసెంట్ రన్ టైం తో “వినరో భాగ్యము విష్ణు కథ”.!

Published on Feb 11, 2023 9:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ ఆబ్బవరం హీరోగా కాశ్మీర పర్దేశి హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో అయితే ఉన్న కాన్సెప్ట్ కి గాను ఆడియెన్స్ లో మరింత ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమా అయితే డీసెంట్ రన్ టైం ని లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా అయితే 138 నిమిషాల నిడివికి మేకర్స్ కట్ చేశారట. మరి ఈ తరహా సినిమాలకి ఇది మంచి రన్ టైం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించగా ఫీఠా ఆర్ట్స్ సమర్పణంలో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :