ధరమ్ తేజ్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పిన వినాయక్ !


మెగాస్టార్ 150వ చిత్రం ;ఖైదీ నెం 150′ తో దర్శకుడిగా గ్రాండ్ సక్సెస్ అందుకున్న వి.వి. వినాయక్ ప్రస్తుతం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజా మీడియా సమావేశంలో ఆయన ఈ సినిమా గురించిన కొన్ని విశేషాల్ని బయటపెట్టారు.

ఈ చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని అంతేగాక ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అన్నారు. అలాగే యూఎస్ లో సినిమా షూట్ ఉండనుందని కూడా తెలియజేశారు. ఇకపోతే ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.