మెగాహీరో సినిమాను మొదలుపెట్టిన వినాయక్ !

22nd, September 2017 - 01:05:46 PM


స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ‘ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాహీరోని డైరెక్ట్ చేయనున్నారు. ఆ హీరోనే సాయి ధరమ్ తేజ్. ఖైదీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వినాయక్ ఎలాంటి సినిమా చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ధరమ్ తేజ్ తో సినిమా అనగానే మరింత ఆసక్తి మొదలైంది. యాక్షన్ సినిమాలని తీయడంలో, హీరోల్ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో సిద్దహస్తుడైన వినాయక్ తేజ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని మెగా అభిమానులు కూడా ఉవ్విళూరుతున్నారు.

గత నెలలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఈరోజే రెగ్యులరు షూట్ మొదలుపెట్టుకుంది. హీరో తేజ్ కూడా ఈ షూట్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా వినాయక్ దర్శకత్వంలో నటించడమనే తన కల ఎట్టకేలకు నెరవేరిందని ధరమ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందించారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించనుంది.