వింటేజ్ చరణ్..అదే పవర్ తో వారికి స్మూత్ వార్నింగ్..!

Published on Jan 29, 2023 7:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ మరో హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ చిత్రం అద్భుతమైన విజయం నమోదు చేయడంతో నిన్న చిత్ర యూనిట్ వరంగల్ లో భారీ సక్సెస్ మీట్ ని పెట్టారు. మరి దీనికి భారీ జన సందోహం రాగా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చాడు. అయితే అనుకున్న దాని కంటే మెగా ఫ్యాన్స్ కి చరణ్ సాలిడ్ ట్రీట్ ని ఈ ఈవెంట్ స్టేజ్ మీద నుంచి ఇచ్చాడు అని చెప్పాలి.

రీసెంట్ గా చిరు పై వచ్చిన పలు కామెంట్స్ కొందరు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన స్మూత్ వార్నింగ్ కోసమే ఆసక్తి గా మారింది. తమ ఫ్యామిలీ పై అనవసరంగా నోరు పారేసుకుంటే తాను ఎవరినీ లెక్క చేయను అన్నట్లుగా అప్పుడు “నాయక్” ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన రోజులు నిన్న గుర్తుకొచ్చాయి. అప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం తాను అడ్డుగా నిలబడితే ఈసారి తన తండ్రి విషయంలో ఆయన నిశ్శబ్దంగా ఉండొచ్చు కానీ మేము అలా ఉండము అంటూ చాలా స్మూత్ అండ్ క్లీన్ గా పవర్ ఫుల్ వార్నింగ్ అయితే ఆ కొందరికి ఇచ్చాడు. దీనితో మళ్లీ వింటేజ్ చరణ్ అలాగే ఉన్నాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :