“విశ్వంభర” తో మళ్ళీ మరుగున పడిన ఆనవాయితీ..

“విశ్వంభర” తో మళ్ళీ మరుగున పడిన ఆనవాయితీ..

Published on Jul 4, 2024 10:02 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రానున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్టతో చేస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత మెగాస్టార్ కెరీర్ లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న చిత్రంగా ఇది నిలవగా ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఏడీర్ చూస్తున్నారు.

అయితే ఈ సినిమాతో మళ్ళీ అలనాటి మెగాస్టార్ ని చూస్తామని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. అలాగే లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణితో కూడా మెగాస్టార్ ఎన్నో ఏళ్ల తర్వాత వర్క్ చేస్తుండడంతో మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. అయితే నేడు కీరవాణి పుట్టినరోజు కావడంతో చిరు ఒక బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టి విశ్వంభర ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా అందించారు.

ఒకప్పుడు సినిమా పాటలు అంటే సంగీత దర్శకుడితో టీం అంతా ఒక దగ్గర కూర్చొని అతడు తన లోని స్వరాలను ఆలపిస్తుంటే అందరి ఆమోద యోగ్యంతో ఆల్బమ్ లు బయటకు వచ్చేవి కానీ ఇప్పుడు మరుగున పడిపోయిన ఆ ఆనవాయితీని విశ్వంభర తో తీసుకొస్తున్నామని టీం కలిసి కీరవాణితో కూర్చొని పాటలు ఆలపిస్తున్న వీడియో పెట్టారు.

అలాగే తమ కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు సమయం స్మృతులను కూడా చిరు మరియు కీరవాణీలు నెమరు వేసుకున్నట్టుగా తెలిపి ఆస్కారుడు కీరవాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు