పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమాకు వింటేజ్ టచ్..?

పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమాకు వింటేజ్ టచ్..?

Published on Jul 8, 2020 7:10 PM IST


చాలా కాలం గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తెలుగు తెర మీదకు వచ్చారు. అలా ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. అయితే తాను హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణుతో పింక్ రీమేక్ “వకీల్ సాబ్” తో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ..

విలక్షణ దర్శకుడు క్రిష్ తో తెరకెక్కించనున్న పీరియాడిక్ డ్రామా కోసం మరింత స్థాయిలో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక టాక్ వినిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాకు “విరూపక్ష” అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ ఈ టైటిల్ కాస్త ఇంకా లైట్ గా అనిపిస్తుంది అని అందుకే అప్పటి కాలంలో సినిమాలు తరహా టైటిల్ ను పెట్టే యోచనలో టీం ఉన్నారని బజ్ వినిపిస్తుంది. పవన్ ఈ చిత్రంలో ఒక దొంగగా కనిపించనున్నారని తెలిసిందే. సో అందుకు రిలేటెడ్ గా వింటేజ్ టచ్ ఇచ్చే విధమైన టైటిల్ ఈ చిత్రానికి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు