సీడెడ్ లో అల్లు అర్జున్ భారీ క్రేజ్ విజువల్స్ వైరల్

సీడెడ్ లో అల్లు అర్జున్ భారీ క్రేజ్ విజువల్స్ వైరల్

Published on May 11, 2024 2:00 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “పుష్ప 2” (Pushpa 2) కూడా ఒకటి. మరి అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ క్రేజ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు అటు ఆన్ లైన్ లోని ఇటు ఆఫ్ లైన్ లో కూడా సమానమైన క్రేజ్ బన్నీ సొంతం.

అయితే అల్లు అర్జున్ తాజాగా నంద్యాల ప్రాంతంలో తన స్నేహితుడు శిల్ప రవీంద్ర రెడ్డి కోసం వెళ్ళాడు. ఇక్కడ తన కోసం వచ్చిన అభిమాన సందోహం చూసి సోషల్ మీడియాలో అంతా షాకవుతున్నారు. ఈ రేంజ్ తన కోసం అభిమానులు రావడంతో ఈ షాకింగ్ క్రేజ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2 on Aug 15th) షూట్ లో మళ్ళీ పాల్గొననుండగా ఈ అవైటెడ్ చిత్రం ఈ ఆగస్ట్ 15 న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు