వైరల్..అవైటెడ్ “RRR” ట్రైలర్ వాయిదా పడిందా.?

Published on Dec 1, 2021 7:08 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మొత్తం అన్ని భాషల్లో కూడా మంచి అంచనాలను ఏర్పరచుకొని విడుదలకు రెడీ అవుతున్న ఈ భారీ సినిమా నుంచి రీసెంట్ గానే మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ ని అనౌన్స్ చేశారు.

ఈ డిసెంబర్ 3 న ఈ భారీ ట్రైలర్ ను ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ అనుకున్న సమయానికి రిలీజ్ చెయ్యడం లేదు అని ఓ టాక్ వైరల్ అవుతుంది. పలు కారణాల చేత ఈ రిలీజ్ ని వాయిదా వేశారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ మరియు కొత్త డేట్ కూడా ఇవ్వనున్నారని తాజా మాట. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డివివి దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :