వైరల్ : “భీమ్లా నాయక్” సెట్స్ లో “భవదీయుడు” యూనిట్ సర్ప్రైజ్.!

Published on Feb 13, 2022 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రెండు సినిమాలు ఆల్రెడీ సెట్స్ లో ఉండగా వీటిలో “భీమ్లా నాయక్” అనే మాస్ చిత్రం అయితే రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కూడా తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ లైనప్ ని కూడా సెట్ చేసుకున్నారు.

మరి అలా అనౌన్స్ చేసిన కొన్ని క్రేజీ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న చిత్రం “భవదీయుడు భగత్ సింగ్”. దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఆల్రెడీ దీని నుంచి ఫస్ట్ లుక్ వచ్చి మంచి రెస్పాన్స్ ని కూడా అందుకుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు భీమ్లా నాయక్ షూట్ ఒక రెండు రోజులు బ్యాలన్స్ ఉండగా ఆ షూట్ లో పవన్ ఇప్పుడు బిజీగా ఉన్నారు.

మరి ఈ సెట్స్ లో భవదీయుడు దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాత రవి లు ఎంట్రీ ఇవ్వడం సర్ప్రైజింగ్ గా మారింది. పవన్ తో కలిసి దిగిన ఫోటోలు హరీష్ శంకర్ షేర్ చేసి త్వరలోనే యాక్షన్ స్టార్ట్ చేస్తామని తెలిపారు. దీనితో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :