వైరల్..తన సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న పవన్?

Published on Sep 8, 2021 3:40 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడు లేని బిజీగా ఇప్పుడు ఉన్నారు. ఓ పక్క సినిమాలను శరవేగంగా చేస్తూనే మరోపక్క తన పొలిటికల్ పనుల్లో కూడా బిజీగా ఉంటున్నారు. మరి తన సినిమాల విషయంలో ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ఆయా సినిమాల మేకర్స్ పలు అప్డేట్స్ ని కూడా అందించారు. అయితే అక్కడ నుంచి పవన్ తన సినిమాల పట్ల ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ టాక్ విస్తృతంగా వైరల్ అవుతుంది.

అయితే దానిలోకి వెళితే ఇటీవల పవన్ సినిమాల నుంచి వచ్చిన ఏ అప్డేట్ లో కూడా “పవర్ స్టార్” అనే ట్యాగ్ ఎక్కడా పడలేదు.. అయితే అది మొదట అంతా యాదృచ్చికమే అనుకున్నారు కానీ పవన్ నే ఈ ట్యాగ్ ఇక వాడొద్దని చెప్పినట్టుగా నయా రూమర్ అందుకే హరీష్ శంకర్ సినిమాని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ 28 వ సినిమాగా ప్రమోట్ చెయ్యడం స్టార్ట్ చేశారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ లేటెస్ట్ అప్డేట్స్ లో మాత్రం పవర్ స్టార్ అనే ట్యాగ్ లేదు..

సంబంధిత సమాచారం :