వైరల్ : “ఆచార్య” ప్రమోషన్స్ లో పూజాతో చిరు రొమాంటిక్ టైమింగ్.!

Published on Apr 26, 2022 6:02 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఇప్పుడు ఈ క్రేజీ ట్రయో మీడియా ముందుకు గాను ప్రమోషన్స్ నిమిత్తం రాగా అక్కడ జరిగిన చిన్ని రొమాంటిక్ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మీట్ అయ్యిన తర్వాత చిరు చరణ్ మరియు పూజా హెగ్డే లు ఫోటోగ్రాఫ్స్ నిమిత్తం ఫోజ్ ఇస్తుండగా ఆ సమయంలో చిరు పక్క నుంచి పూజా వెళ్ళిపోబోతుంది ఆ సమయంలో చిరు తన కామెడీ టైమింగ్ తో పూజా ని వెనక్కి లాగుతున్నట్టు చూపించారు.

దీనితో ఆఫ్ స్క్రీన్ లో చాలా కాలం తర్వాత చిరు నుంచి ఇలాంటి రొమాంటిక్ కామెడీ టైమింగ్ చూడడంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వైరల్ వీడియో పై పూజా కూడా స్పందిస్తూ చిరు చాలా స్వీట్ గా హుషారుగా ఉంటారని పూజా హెగ్డే తెలిపింది.

సంబంధిత సమాచారం :