వైరల్ : ‘ధరణి’ తో ‘రావణాసుర’..క్రేజీ ప్లానింగ్..!

వైరల్ : ‘ధరణి’ తో ‘రావణాసుర’..క్రేజీ ప్లానింగ్..!

Published on Mar 23, 2023 3:42 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా “దసరా” కోసం తెలిసిందే. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని అయితే మేకర్స్ ఇప్పుడు చేస్తుండగా మరో క్రేజీ ప్లానింగ్ ని అయితే డబుల్ ప్రమోషన్స్ లా ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా నాని పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది.

మాస్ మహారాజ రవితేజ తో కలిసి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్నాప్ ని షేర్ చేయగా ఇది ఇప్పుడు ఫ్యాన్స్ కి మామూలు ఆనందం కలిగించడం లేదు. మరి నాని అయితే సంథింగ్ ఫన్నీ గా చేసాం అంటూ నాని పోస్ట్ చేయగా దానికి రవితేజ కూడా ధరణి * రావణాసుర అంటూ పోస్ట్ చేశారు. దీనితో వీరి పోస్ట్ లు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. మరి ఈ కాంబోలో ఇంటర్వ్యూ ఏమన్నా ప్లాన్ చేసారో ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు