వైరల్..”RRR” ట్రీట్ కి ఎలాన్ మస్క్ రిప్లై.!

Published on Mar 21, 2023 8:01 am IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓ రేంజ్ లో సెన్సేషన్ ని రేపుతూ హవా కొనసాగిస్తున్న మన టాలీవుడ్ పాన్ వరల్డ్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ ఎమోషనల్ ట్రీట్ నుంచి “నాటు నాటు” సాంగ్ ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు.

లేటెస్ట్ గా నాటు నాటు సాంగ్ కి గాను ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా వారు తమ కార్లు తో మ్యూజిక్ కి సింక్ అయ్యేలా లైట్స్ ట్రీట్ తో అదిరే వీడియో చేశారు. మరి దీనితో ఈ వీడియో కి గాను టెస్లా రెండు లవ్ ఎమోజిస్ తో చిత్ర యూనిట్ కి సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం కేజ్రీగా మారింది.

సోషల్ మీడియాలో దాదాపు తన బిజినెస్, డాజి, టెస్లా కొన్ని మీమ్స్ తో గడిపే మస్క్ సినిమాలకు సంబంధించి ఎప్పుడూ పోస్ట్ పెట్టడం కానీ స్పందించింది కానీ లేదు. అలాంటిది ఇప్పుడు RRR కి రిప్లై ఇవ్వడం అనేది క్రేజీ అంశం గా మారింది. అంతే కాకుండా దీనికి రిప్లై గాను చిత్ర యూనిట్ మేము మా లవ్ ని పే చేసాము అంటూ తనకి రిప్లై ఇచ్చారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :