ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప చిత్రం ఏ రేంజ్ సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి అల్లు అర్జున్ తన ఐకానిక్ మూమెంట్స్ తో పాన్ ఇండియా సహా ఇంటర్నేషనల్ ప్రముఖుల్లో కూడా క్లిక్ అయ్యాడు. అలా గత మార్చ్ నెలలోనే ఇంగ్లీష్ పాప్ సింగర్ ఈడ్ షెరన్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రం బుట్ట బొమ్మ హుక్ స్టెప్ వేసి అదరగొట్టగా ఇప్పుడు మరో ఇదే పాప్ సింగర్ పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప సిగ్నేచర్ మూమెంట్ తగ్గేదేలే తో అదరగొట్టాడు.
తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అల్లు అర్జున్ పుష్ప హిందీ డైలాగ్ మై జుకుంగే నహి సాల అంటూ తన మూమెంట్ చేయగా ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి అయితే అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది అని చెప్పాలి. మరి పుష్ప 2 (Pushpa 2 The Rule) వచ్చాక ఇది ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ ఆగష్టు 15న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.