వైరల్ : దిగ్గజాలు చిరు, కమల్, సల్మాన్ ఖాన్ ల సెన్సేషనల్ కలయిక.!

Published on Jun 12, 2022 9:00 am IST


ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దిగ్గజ నటుడు తమ ఇండస్ట్రీ నుంచి లెజెండ్స్ గా ఎదిగారు. అలా మన తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి తమిళ్ లో లోక నాయకుడు కమల్ హాసన్ బాలీవుడ్ లో భాయ్ సల్మాన్ ఖాన్ లు ఒకరు. అయితే ఇలాంటి లెజెండరీ నటులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇపుడు కమల్ భారీ హిట్ సినిమా విక్రమ్ సక్సెస్ తో ఈ సెన్సేషనల్ కలయిక జరగడం వారి అభిమానులకు ఓ రేంజ్ లో హై ఇస్తుంది.

మెగాస్టార్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ తో ఇది రివీల్ అయ్యింది. విక్రమ్ తో మంచి విజయాన్ని అందుకున్నందుకు గాను నా ఓల్డెస్ట్ ఫ్రెండ్ కమల్ హాసన్ కి శాలువా కప్పి పూల గుచ్చంతో అభినందలు తెలిపి దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మరియు అతని టీం కి సూపర్ కంగ్రాట్యులేషన్ నేను సల్మాన్ లు తెలుపుతున్నామని మెగాస్టార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా తెలియజేసారు. దీనితో ఈ ఊహించని కలయిక ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :