వైరల్ : గూగుల్ లో “జవాన్” మ్యాజిక్.!

Published on Sep 8, 2023 1:04 pm IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “జవాన్”. మరి భారీ హైప్ నడుమ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా జరుపుకుంది. అయితే ఓ పక్క బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం విషయంలో లేటెస్ట్ గా గూగుల్ సెర్చ్ లో అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ వైరల్ గా మారింది.

మరి సెర్చ్ ఇంజిన్ గూగుల్ లోకి వెళ్లి జవాన్ అని సెర్చ్ చేస్తే సినిమా డీటెయిల్స్ వస్తాయి. కానీ కింద ఒక వాకీ టాకీ లాంటిది వస్తుంది. దానిని క్లిక్ చేస్తే అప్పుడు జరుగుతుంది అసలు మ్యాజిక్. దీనితో ఈ ట్రిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఓసారి ట్రై చేస్తే దీనిని అదేంటో మీకు కూడా తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు అలాగే రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :