వైరల్ : ఎన్టీయార్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ ల నివాళులు.!

Published on May 28, 2022 7:57 am IST

తెలుగు నేలకి అలాగే తెలుగు సినిమాకి అపారమైన పేరు తీసుకొచ్చిన ప్రథమ తెలుగు నటులు ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ నందమూరి తారకరామారావు అని చెప్పాలి. ఎన్టీఆర్ తెలుగు సినిమా కోసం ముఖ్యంగా తెలుగు వారి కోసం చాలా కృషి చేసారు. మరి అలనాటి మహనీయుడు పుట్టి నేటికి 100 ఏళ్ళు పూర్తి అవ్వడంతో ఈ ప్రత్యేక దినాన్ని నందమూరి కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని కీలక ప్లానింగులు చేసారు.

అయితే ఎన్టీయార్ నూరవ జయంతి సందర్భంగా ఈ తెల్లవారు జామునే ఆ మహనీయుని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ లు తారక రాముని ఘాట్ వద్దకి చేరుకొని ఎంతో భావోద్వేగంతో వారు నివాళులు అర్పించగా అక్కడ అభిమానులతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. దీనితో ఇప్పుడు వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :