వైరల్ : సినిమా లెవెల్లో అదరగొడుతున్న ధోని యాక్షన్.!

Published on Jan 25, 2022 3:55 pm IST


మన సినిమాల్లో పలువురు హీరోలకి ఎలా అయితే భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అదే విధంగా క్రికెట్ విషయానికి వస్తే కొంతమంది స్టార్ క్రికెటర్స్ కి కూడా ఉంది. మరి అలాంటి వారిలో టీం ఇండియా మాజీ క్యాప్టెన్ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు.

అయితే ధోని క్రికెట్ తో పాటుగా అనేక యాడ్స్ లో కూడా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటి వరకు ఎన్నో యాడ్స్ లో నటించాడు కానీ లేటెస్ట్ గా వచ్చిన ఒక యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తో ఉందని చెప్పాలి. ఒక సాలిడ్ యాక్షన్ సినిమా లెవెల్ విజువల్స్ తో ధోని తన కొత్త యాడ్ లో అదరగొట్టేసాడు.

దీనితో ధోని మంచి యాక్షన్ హీరోగా మారిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. దీనిని అన్ అకాడమీ వారు రిలీజ్ చెయ్యగా దానికి ఒక్క ట్విట్టర్ నుంచే 3 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఇంకా యూట్యూబ్ లో అయితే ఒక్కరోజులోనే 8 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ యాడ్ పలువురు సినీ నటుల్లో కూడా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :