వైరల్ : “పుష్ప” శ్రీవల్లి సాంగ్ కి ఏకంగా నరేంద్ర మోడీ స్టెప్పులు..!

Published on Jan 22, 2022 11:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ భారీ సినిమా పుష్ప సెన్సేషన్ ఇంకా కొనసాగుతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ రెండు రోజులు నుంచి పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కి సంబంధించి మరిన్ని హాట్ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిన్ననే ఈ హిట్ ట్రాక్ కి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ బన్నీ సిగ్నేచర్ స్టెప్ వెయ్యగా అది కాస్తా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఇంకో వీడియో ఒకటి వచ్చి వాట్సాప్ ట్విట్టర్ యూనివర్సిటీ లలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే స్టెప్పేసారు. అయితే ఇది నిజంగా చేసింది కాదు కొంత మంది క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీని క్రియేట్ చేసి పుష్ప రాజ్ స్టెప్ వేయించడమే కాకుండా లాస్ట్ లో తగ్గేదేలే మూమెంట్ కూడా చూపించారు. దీనితో ఎంతో ఫన్ గా అనిపిస్తున్న ఈ వీడియో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :