వైరల్ అవుతున్న నయనతార పెళ్లి వీడియో !

Published on Sep 25, 2022 11:16 pm IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగి.. మొత్తానికి జూన్లో పెళ్లితో ఒకటి అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు ఇంతవరకు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నారు ఈ క్రేజీ కపుల్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనికి భారీ మొత్తాన్ని చెల్లించింది.

కాగా నయనతార పెళ్ళికి సంబంధించిన ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీజర్ లో నయనతార – విఘ్నేష్‌ శివన్‌ ఇద్దరూ మెరిసిపోతూ కనిపించారు. ఈ జంట చూడటానికి చాలా బాగుంది. ఇక నయనతార ప్రస్తుతం తన భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

రీసెంట్ గానే విఘ్నేష్ శివ‌న్ పుట్టిన‌రోజుకి నయనతార అతన్ని సర్ ప్రైజ్ చేసింది. ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నంగా పేరున్న బుర్జ్ ఖ‌లీఫా ముందు విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డేను న‌య‌న‌తార గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :