వైరల్ : “ఒక్కడు” స్పెషల్ షో చూసిన ఒక్కడు సినిమా యూనిట్.!

వైరల్ : “ఒక్కడు” స్పెషల్ షో చూసిన ఒక్కడు సినిమా యూనిట్.!

Published on Aug 9, 2022 10:06 AM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈరోజు కావడంతో సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డే విషెష్ తో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ స్పెషల్ డే కి గాను మహేష్ నటించిన రెండు భారీ హిట్ చిత్రాలు “ఒక్కడు”, “పోకిరి” చిత్రాలు స్పెషల్ షోలు సాలిడ్ ప్రింట్స్ తో స్టార్ట్ చేశారు. అయితే ఈ షో లలో ఒక్కడు సినిమాకి గాను ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చోటు చేసుకుంది.

హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్ లో ఈ సినిమా స్పెషల్ షో ని ఈ సినిమా హీరోయిన్ భూమిక అలాగే దర్శకుడు గుణశేఖర్ తమ ఫ్యామిలీస్ తో అభిమానులతో కలిపి వీక్షించారు. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మంచి వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ హిట్ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించగా ఎం ఎస్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు