వైరల్ పిక్: బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో దిల్ రాజు మీట్..

వైరల్ పిక్: బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో దిల్ రాజు మీట్..

Published on Jun 20, 2024 8:01 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో ఇది 109వ సినిమాగా (NBK 109) తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా బాలయ్య ఈ సినిమాని హ్యాట్రిక్ సెన్సేషనల్ హిట్స్ తర్వాత చేస్తున్న సంగతి తెలిసిందే.

అందుకే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ హ్యాట్రిక్ తో పాటుగా బాలయ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా హ్యాట్రిక్ కొట్టారు. అదే తన పాలిటిక్స్ లో ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ ఘన విజయాలు నమోదు చేయడం మరింత స్పెషల్ గా మారింది. దీనితో తాజాగా ప్రముఖ స్టార్ నిర్మాత దిల్ రాజు బాలయ్య ని కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు. దీనితో ఈ పిక్ ఇపుడు వైరల్ గా మారింది. మరి ఈ సాలిడ్ కాంబినేషన్ లో ఏమన్నా సినిమా పడొచ్చో ఏమో అనేది మాత్రం వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు