వైరల్ పిక్ : 108 వ మూవీలో స్టైలిష్ లుక్ లో బాలయ్య

Published on Mar 28, 2023 2:02 am IST

ఇటీవల వీరసింహారెడ్డి మూవీతో సక్సెస్ సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన కెరీర్ 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర చేస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇటీవల ఉగాది సందర్భంగా బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా నేడు ఈ మూవీ నుండి బాలయ్య మరొక స్టైలిష్ లుక్ బయటకు వచ్చింది. ఆకట్టుకునే హెయిర్ స్టైల్, గడ్డంతో పాటు సన్ గ్లాసెస్ అలానే మెడలో స్కార్ఫ్ తో బాలయ్య ఈ లుక్ లో అదిరిపోయారు. కాగా ప్రస్తుతం ఈ స్టైలిష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :