వైరల్ పిక్ : తన దిగ్గజ దర్శకునితో కమల్ ఆప్యాయ కలయిక.!

వైరల్ పిక్ : తన దిగ్గజ దర్శకునితో కమల్ ఆప్యాయ కలయిక.!

Published on Nov 23, 2022 2:14 PM IST

ఇండియన్ సినిమా దగ్గర కొన్ని సెన్సేషనల్ కాంబినేషన్స్ ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. మరి అలాంటి చాలా అరుదైన మరియు అపురూపమైన కాంబినేషన్స్ లో కళా తపస్వి కె విశ్వనాథ్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కలయికలో వచ్చిన ప్రతి చిత్రం కూడా ఒక ఆణిముత్యంగా కాగా ప్రతి సినిమా ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

మరి లేటెస్ట్ గా అయితే కమల్ హైదరాబాద్ లోని విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లి వారిని కలిసి ఆప్యాయంగా పలకరించడం మూవీ లవర్స్ కి ఎంతో ఆనందంగా అనిపించింది. మరి కమల్ విశ్వనాథ్ చేతిని పట్టుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా ఈ పిక్ లో కనిపిస్తుంది. దీనితో చాలా కాలం తర్వాత కలిసిన ఈ కలయిక ఫోటో సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అయితే కమల్ “ఇండియన్ 2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు