వైరల్ పిక్ : డిన్నర్ లో మహేష్, త్రివిక్రమ్ సహా థమన్.!

Published on Dec 7, 2022 12:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఈ ఏడాది తాను ఎదుర్కొన్న కష్ట పరిస్థితులు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ వస్తున్నారు. అయితే వీటిని స్వాగతిస్తూ తన తండ్రి ఇచ్చిన మనో ధైర్యంతో ముందు రోజుల్లో మరింత బలంగా నిలబడతానని మహేష్ అయితే ప్రామిస్ చేశారు.

ఇక ఫ్యామిలీతో అయితే ఇపుడు మహేష్ ఆనందంగా గడుపుతూ కనిపిస్తూ ఉండడం అందరిలో కాస్త ఊరటగా ఉండగా లేటెస్ట్ గా అయితే తన ఫ్యామిలీ సహా తన దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసిన ఓ మీటింగ్ ఆసక్తిగా మారగా పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే వీటిలో మహేష్ సహా త్రివిక్రమ్ మరియు తమ కొత్త సినిమా సంగీత దర్శకుడు థమన్ కూడా కలిసి డిన్నర్ చేస్తున్నట్టుగా ఓ ఫోటో మంచి వైరల్ గా మారింది. దీనితో ఈ హ్యాపీ మూమెంట్ లో ఉన్న మహేష్ ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి నెక్స్ట్ షెడ్యూల్ కొన్ని వారాల తర్వాత స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :