వైరల్ పిక్ : ఇళయదళపతి తో యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్

Published on Mar 14, 2023 6:16 pm IST

యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తొలిసారిగా ఆవియాల్ మూవీ ద్వారా కోలీవుడ్ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా వరుసగా పలు సూపర్ హిట్స్ తో దర్శకుడిగా మంచి సక్సెస్ లతో పాటు ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో లియో మూవీ తీస్తున్నారు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ అక్టోబర్ 19, 2023 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే విషయం ఏమిటంటే, నేడు తన బర్త్ డే కావడంతో హీరో విజయ్ తో కలిసి దిగిన ఒక లేటెస్ట్ పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు లోకేష్. నాకు అన్ని అందించినందకు ప్రత్యేక కృతజ్ఞతలు విజయ్ అన్న అంటూ లోకేష్ పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా లియో మూవీలో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా విజయ్ కి జోడీగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ మూవీని యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు లోకేష్ కనకరాజ్. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈమూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :