పెళ్లి ఫోటోల్లో మెరిసిపోతున్న హీరోయిన్ !

పెళ్లి ఫోటోల్లో మెరిసిపోతున్న హీరోయిన్ !

Published on Dec 5, 2022 10:15 AM IST

బబ్లీ బ్యూటీ హన్సికా మోట్వాని పెళ్లి పీట‌లెక్కిన సంగతి తెలిసిందే. ఆమె తన బిజినెస్ పార్ట్నర్ మరియు తన చిరకాల ప్రియుడు అయినా సోహైల్‌ కథూరియా ను వివాహం చేసుకుంది. నిన్న రాత్రి వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోట వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో హ‌న్సిక‌ – సోహైల్ ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది.

కాగా హన్సికా మోట్వాని – సోహైల్‌ కథూరియా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పెళ్లి ఫోటోల్లో హన్సిక చాలా అందంగా కనిపిస్తోంది. ఇక హన్సిక మంచి హీరోయిన్ మాత్ర‌మే కాదు.. ఈమె సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు