వైరల్: గౌతమ్ ఫస్ట్ స్టేజ్ షోలో మహేష్, నమ్రత

వైరల్: గౌతమ్ ఫస్ట్ స్టేజ్ షోలో మహేష్, నమ్రత

Published on Jun 23, 2024 8:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు త్రివిక్రమ్ తో చేసిన “గుంటూరు కారం” మహేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ తర్వాత ఓ పక్క తన 29వ సినిమాకి ప్రిపేర్ అవుతూనే మహేష్ సమయం దొరికినప్పుడు అంతా తన ఫ్యామిలీ తోనే గడుపుతున్నాడు. అలా లేటెస్ట్ గా మహేష్ ఫ్యామిలీ అయితే తమ వారసుడు గౌతమ్ ఘట్టమనేని చేసిన ఫస్ట్ ఎవర్ థియేటర్ స్టేజ్ షోకి హాజరైన పిక్స్ కొన్ని వైరల్ గా మారాయి.

మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లండన్ లో ఈ స్పెషల్ సాయంత్రం గౌతమ్ మొట్ట మొదటి థియేటర్ స్టేజ్ షో తో ఎంతో ఆనందంగా గడిచింది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన స్టేజ్ పెర్ఫామెన్స్ చాలా బాగా చేసాడు అని గర్వం వ్యక్తం చేశారు. ఇలా మహేష్ తో అలాగే తమ కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో కలిసిన పిక్స్ ని షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు