వైరల్ పిక్స్ : శర్వానంద్ పెళ్ళిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సందడి

Published on Jun 7, 2023 6:12 pm IST

టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన శర్వానంద్ తన కెరీర్ బిగినింగ్ నుండి వైవిధ్యమైన పాత్రలు సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకంగా క్రేజ్ అందుకున్నారు. ఇక ఇటీవల టైం ట్రావెల్ మూవీ ఒకే ఒక జీవితం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక సక్సెస్ అందుకున్నారు శర్వానంద్. అయితే విషయం ఏమిటంటే, జూన్ 3 న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ వేడుకకు రామచరణ్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ సహా పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక ఈ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ మరింత అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ వేడుకు సిద్దార్థ, అదితిరావు హైదరీ కూడా వచ్చారు. మొత్తంగా ఎంతో వేడుకగా జరిగిన శర్వానంద్, రక్షిత రెడ్డి ల వివాహాం ఎంతో వైభవంగా జరిగింది. కాగా వీరి పెళ్లి వేడుకకి రామ్ చరణ్ విచ్చేసిన విష్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :