వైరల్ పిక్స్ : జి 20 సదస్సు కోసం శ్రీనగర్ చేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

Published on May 22, 2023 5:30 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కియారా అద్వానీ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని దిగ్గజ దర్శకుడు శంకర్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే నేడు కాశ్మీర్ లో జరుగనున్న జి 20 సదస్సులో రామ్ చరణ్ పాల్గొననున్నారు.

3వ జి 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ యొక్క ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్ పై మొదటి సైడ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు కొద్దిసేపటి క్రితం శ్రీనగర్ చేరుకున్నారు రామ్ చరణ్. ఈ సందర్భంగా అక్కడి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న చరణ్ కి ఘన స్వాగతం లభించింది. కాగా అక్కడి స్థానిక మీడియా తీసిన రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :