వైరల్ పిక్స్..వేంకటేశ్వరుని సన్నిధిలో ప్రభాస్.!

Published on Jun 6, 2023 9:05 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్” కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ రోజు తిరుపతిలో అయితే జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. మరి ఈ మాసివ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం కాగా ప్రభాస్ ఆల్రెడీ తిరుపతిలో ఉన్నాడు.

అయితే ఈరోజు ఉదయం ప్రభాస్ తిరుమలకి చేరుకొని ఈ వేంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడానికి దైవ సందర్శనార్ధం కొండ పైకి చేరుకున్నాడు. దీనితో ఇపుడు ప్రభాస్ పిక్స్ బయటకొచ్చి వైరల్ గా మారాయి. పంచె కట్టు లో వైట్ అండ్ వైట్ తో అయితే ప్రభాస్ గోవిందుని సన్నిధిలో కనిపిస్తున్నాడు. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రబస్ లుక్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ సాయంత్రం అయితే జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో ప్రభాస్ సహా అనేకమంది ప్రముఖులు పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం :