వైరల్ పిక్స్ : మోదీ, చిరు – జగన్ లతో రోజా సెల్ఫీలు !

Published on Jul 4, 2022 3:20 pm IST


భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. కాగా నేడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నగరంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలలో ఆమె నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని వారాల క్రితమే, రోజా ప్రసిద్ధ టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :