వైరల్ : ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ …!!

వైరల్ : ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ …!!

Published on Jul 7, 2022 8:00 PM IST

భారీ పాన్ ఇండియా మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా ప్రతిష్టాత్మక మూవీ పొన్నియన్ సెల్వన్. భారతదేశంలోని పలు భాషల్లో గల దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మిస్తుండగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ నుండి విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష ల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసిన యూనిట్, రేపు సాయంత్రం 6గం. లకు ఈ మూవీ టీజర్ ని చెన్నైలో ఒక ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ హిందీ టీజర్ ని అమితాబ్ బచ్చన్, మలయాళ టీజర్ ని మోహన్ లాల్, అలానే తెలుగు టీజర్ ని మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారు. 10వ శతాబ్దంలో జరిగిన చోళ సామ్రాజ్య నేపథ్యంలో సాగె కధగా ఈ మూవీ సాగనుండగా దీనిని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇది మొదటి భాగం కాగా, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వందల కోట్ల ఖర్చుతో ఎన్నో వ్యయప్రయాశలతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ తప్పకుండా ఆడియన్స్ అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు